నేతలతో భేటీలతో వైయస్ జగన్ బిజీ: ప్రభావం ఉంటుందన్న పెన్మెత్స

YS Jagan
హైదరాబాద్: హైదరాబాదులోని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు సందర్శకులతో కిటకిటలాడుతుంది. త్వరలో పార్టీ పెట్టబోతున్న జగన్ ను కలవడానికి కాంగ్రెస్, తెలుగుదేశంలనుండి పలువురు నాయకులు వస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరావు వైయస్ జగన్ ను కలిశారు. కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో జగన్ ఎఫెక్టు తప్పకుండా ఉంటుందని ఆయన చెప్పారు.

పదిరోజుల్లోనే జిల్లాలో జగన్ కు అనుకూలంగా భారీ మార్పులు వచ్చాయని, రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు వస్తాయని ఆయన చెప్పారు. జగన్ ను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణరావుకు రాజకీయంగా నూకలు చెల్లినట్టేనని చెప్పారు. జగన్ వెంట నడవడానికి జిల్లాలో పెక్కుమంది సిద్ధంగా ఉన్నారన్నారు. కాగా జగన్ ను తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యులు బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాంగ్రెస్ జగన్ వర్గం శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గురునాథ్ రెడ్డి, సినీ నటుడు విజయ్ చందర్ తదితరులు కలిశారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన 15మంది శాసనసభ్యులు జగన్ ను కలిశారు. తమ శాసనసభ్యులు కూడా మీ వెంటే వస్తారని జగన్ కు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+