కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు దీక్ష విరమణ

Congress
హైదరాబాద్: ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పార్లమెంటు సభ్యులు చేసిన డిమాండుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తలొగ్గడంతో ఎంపీలు తమ దీక్షను మంగళవారం మధ్యాహ్నం విరమించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేసులు ఉపసంహరిస్తామని ప్రకటన చేసిన అనంతరం ఎంపీలు తమ దీక్షను విరమించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య, సునీతారెడ్డి వచ్చి ఎంపీల దీక్షను స్వయంగా విరమింపజేశారు.

విద్యార్థుల సమస్యపై చిత్తశుద్ధితో పోరాడి విజయం సాధించామని, ఇలాగే అందరం కలిసి కట్టుగా పోయి తెలంగాణను కూడా సాధిస్తామని చెప్పారు. ఇప్పుడు తొలి విజయం మాత్రమే సాధించామన్నారు. ఇదే అంతం కాదని, ఆరంభం మాత్రమేనన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం దిగి రావడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో ఎలాంటి రాజీ ప్రసక్తి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన చేసిందన్నారు. కానీ కొందరు దానిని అడ్డుకున్నారు. కమిటీ నివేదికతో తమకు సంబంధం లేదని తెలంగాణ సాధనే తమ ధ్యేయమన్నారు.

రెండురోజులుగా ఎంపీలకు మద్దతు పలికిన వారికి మంత్రి జానారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేసులు ఎత్తివేసి విద్యార్థులకు ఊరట కలిగించాల్సిన ఆవశ్యకత ఉందని, కేసులు ఎత్తివేయడమే సమంజసమని ప్రభుత్వం కూడా యోచించిందని, అయితే అడ్మినిస్ట్రేషన్ దృష్ట్యా ఆలస్యమైందన్నారు. ఎంపీల సత్యాగ్రహ దీక్ష దృష్ట్యా ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకున్నదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కూడా సానుకూలంగా స్పందించడం ఆనందించదగ్గ విషయమన్నారు.

ఒక సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాల్సిన ఉద్దేశ్యంతోనే విద్యార్థులు ఉద్యమించినట్లుగా భావించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కేసులు ఎత్తివేస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం ఆలోచించిందన్నారు. శాసనసభలోనే కొన్ని కేసులు ఎత్తివేశామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కూడా పలుమార్లు తెలంగాణ నేతలతో కేసులపై సమీక్షాంచారని చెప్పారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేసినందువల్ల పార్లమెంటు సభ్యులు తమ దీక్షను విరమించాలని ఆమె కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+