తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే కేంద్రం నిర్ణయం:డి. శ్రీనివాస్

D Srinivas
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఈ ప్రాంత ప్రజల ఆశలు, అభీష్టం దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. కారణం ఏదైనా కాంగ్రెస్‌కు నష్టం కలిగించే ఆలోచన పార్టీ శ్రేణుల్లో ఎవరికీ రాకూడదని చెప్పారు. పార్టీ 126వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారమిక్కడ గాంధీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితోపాటు ఆయన పాల్గొన్నారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం డీఎస్‌ మాట్లాడుతూ- రాష్ట్రం అత్యంత కీలక సమస్యను ఎదుర్కొంటున్న తరుణంలో యువ నాయకుడు కిరణ్‌ కు ముఖ్యమంత్రి బాధ్యతల్ని అప్పగించడం సమర్థ పాలన అందించేందుకు దోహదం చేస్తోందన్నారు.

అయోమయం సృష్టించే వారి ఎత్తుగడల వలలో పడకుండా కాంగ్రెస్‌ను కాపాడుకునే బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని డీఎస్‌ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలపై బృహత్తర బాధ్యత ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో క్రియాశీల పాత్రను బాధ్యతతో నిర్వర్తిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు వారు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు పార్టీ 126వ వ్యవస్థాపక దినోత్సవం, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ప్లీనరీలో నిర్ణయించిన మేరకు విధివిధానాలు అందిన వెంటనే రాష్ట్ర, జిల్లా, బ్లాకు, మండల స్థాయుల్లో కార్యకర్తల భాగస్వామ్యం ఉండేలా పరిశీలన కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+