హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్, తెలంగాణలపై మంత్రులకు సిఎం కిరణ్ కుమార్ క్లాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్ జగన్ వ్యవహారంపై, తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ అంశం, వైయస్ జగన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చర్చకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణతో పాటు అన్ని అంశాలపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. మంత్రులు ఇష్టం వచ్చినట్లు ఎవరికి నచ్చిన విషయాలు వారు మాట్లాడకూడదని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని ఆయన చెప్పారు. ఇందుకు గాను మంత్రులు తమ తమ శాఖల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను అందించాలని ఆయన సూచించారు.

కాగా, వైయస్ జగన్ చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనినీ జగన్ తప్పు పడుతున్నారని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన చెబుతూ వైయస్ జగన్ విమర్శలను మంత్రులు సమర్థంగా తిప్పికొట్టాలని, తగిన విధంగా జగన్ విమర్శలకు సమాధానం ఇవ్వాలని ఆయన సూచించారు. వైయస్ జగన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించకూడదని, అధిష్టానం కూడా అదే విషయం చెప్పిందని మంత్రి వట్టి వసంతకుమార్ అన్నట్లు సమాచారం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చుననే విషయాన్ని మంత్రి ధర్మాన ప్రసాదరావు పరోక్షంగా ప్రస్తావనకు తెచ్చారు. మనం సరిగా వ్యవహరించకపోతే పాలన మన చేతి నుంచి పోయే ప్రమాదం ఉందని ఆయన చెప్పినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X