జగన్ తో మంతనాలు లేవు, మాకు తెలంగాణే ముఖ్యం: హరీష్ రావు

తెలంగాణలో పర్యటన కోసం జగన్ వచ్చినప్పుడు జగన్ అడ్డుకున్నది తానేనని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణ వ్యతిరేకితో కలుస్తామని అనుకోవటంలో నిజం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయితే తెరాస అధ్యక్షుడు కేసిఆర్ తన చాతుర్యంతో తెలంగాణలో నీరుగాకుండా చూశారన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్ ఇద్దరూ తెలంగాణ వ్యతిరేకులని అలాంటి వారితో ఎందుకు కలుస్తామన్నారు.
ఎన్నికలు రావాలని మేం కోరుకోవటం లేదని అయితే జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టినా మాకు సంబంధం లేదని, అలాంటి సమయంలో తెలంగాణ కోసం ఎన్నికలకు పాల్గొనవలసిన ఆవశ్యకత మాకు ఉందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొటితే ఆదుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు. తెలంగాణ ఇస్తుందనే నమ్మకంతోనే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదుకున్నామని అయితే ఇప్పుడు కాంగ్రెస్ పై నమ్మకం లేదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు తెలంగాణ ఇస్తే రెండు ప్రాంతాలలో వారి ప్రభుత్వం ఏర్పడి వారే లాభపడుతారు. కాబట్టి తెలంగాణ ఇవ్వమనండి అని సూచించారు.
మాకు 11 సీట్లే ఉన్నాయి కాబట్టి వారే అధికారంలోకి వస్తారన్నారు. తెలంగాణ ప్రకటిస్తే అభినందిస్తామని, అయితే ప్రజలు కూడా కాంగ్రెస్ ను నమ్మె పరిస్థితుల్లో లేదన్నారు. ఒకవేళ తెలంగాణ ప్రకటించినా దళితలనే ముఖ్యమంత్రి చేస్తానని కెసిఆర్ ప్రకటించారని, కెసిఆర్ పదవులకోసం ఎప్పుడూ ప్రాకులాడలేదన్నారు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ రాకుంటే రాజీనామా చేస్తామని ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు తెలంగాణలో తిరుగుతారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం హర్షదాయకం అన్నారు. అయితే అందులో రాజకీయం ఉందన్నారు.












Click it and Unblock the Notifications
