తుది దశలో తెలంగాణ ఉద్యమం: తెరాస అధినేత కె చంద్రశేఖర రావు

ఉద్యోగులందరినీ ప్రభుత్వం కాంట్రాక్టు ప్రాతిపదికపైన నియమిస్తోందని, ముఖ్యమంత్రినీ మంత్రులనూ కాంట్రాక్టు పద్ధతిపై నియమిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. హైదరాబాదులో తెలంగాణకు చెందిన ఒక్క కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కూడా లేడని, ఆదాయం మనది - అధికారం ఆంధ్రోళ్లదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే జిల్లాకు పది వేల ఉద్యోగాలు వస్తాయని, మొత్తం లక్ష ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. ఉద్యోగులందరూ తెలంగాణ సాధన కోసం తట్టాపారా కింద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications