టిడిపి నుంచి తప్పుకుంటా, తెరాసలో చేరుతా: పోచారం శ్రీనివాస రెడ్డి

తెరాస నాయకులు వారం రోజుల నుంచి ఫోన్లు చేస్తున్నారని, తాను వారికి ఏమీ చెప్పలేదని, ఈ స్థితిలో నియోజకవర్గంలో అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి నివేదిక ఇచ్చామని, తెరాసతో పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు తెలంగాణ కోసం తెలుగుదేశంలో ఉండి పోరాటం చేయలేని స్థితి ఉందని, ఈ విషయాన్ని తాను పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పానని ఆయన అన్నారు. తాము తెలుగుదేశంలో తెలంగాణపై నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications