సూరి హత్య కేసు: భానుకిరణ్‌పై బిగుస్తున్న ఉచ్చు

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్యపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య సమయంలో కారును నడుపుతున్న మధుసూదన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. మధుసూదన్ చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. మధు వివరాల ప్రకారం పోలీసులు తయారు చేసిన ఎఫ్ఐఆర్‌లో పూర్తి వివరాలు ఉంచారు. 307, 27 ఆర్మ్ సెక్షన్ ప్రకారం భానుపై పోలీసులు కేసు నమోదు చేశారు. భానుతో పాటు గన్‌మెన్ మదన్‌మోహన్‌సింగ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్‌లోని అలేఖ్య అపార్టుమెంటునుండి మద్దెలచెర్వు సూరి, భానుకిరణ్, మధుసూదన్ ‌రెడ్డి బయలు దేరారు. అక్కడినుండి నేరుగా సనత్‌నగర్ చేరుకున్నారు. అక్కడ మద్దెలచెర్వు సూరి తరఫు లాయర్లు అచ్యుతరెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు. వారితో పరిటాల రవి హత్యపై చర్చించారు. అనంతరం సనత్‌నగర్ నుండి బంజారాహిల్స్‌లో ఉంటున్న సూరికి దగ్గరి స్నేహితుడు శ్రీనివాస్‌ రెడ్డి ఇంటికి ముగ్గురు కలిసి బయలుదేరారు. అప్పుడు కారును మధుసుదన్ డ్రైవింగ్ చేస్తుండగా, సూరి ముందు కూర్చున్నాడు. భానుకిరణ్ వెనుక సీట్లో కూర్చున్నాడు. ఎసి కారణంగా విండో పూర్తిగా మూసివేశారు.

అప్పుడు కారు గంటకు 25 కి.మీ.వేగంతో వెళుతుంది. కారు నవోదయ కాలనీకి చేరగానే ఓ పెద్ద శబ్దం వినిపించింది. మధు వెంటనే కారు స్లో చేశారు. ఆ సమయంలో భాను కారు దిగి ఏదో భారీ శబ్ధం వినిపించిందని, అటాక్ జరగిందని చెప్పి అక్కడినుండి దిగి వెళ్లిపోయాడు. ఆ సమయంలో సూరి ఏం జరిగింది అంటూ తనపై పడ్డాడు. ఆ సమయంలో సూరి తల వెనుక భాగం నుండి రక్తం కారడం మధు చూశాడు. భానుకు ఫోన్ చేస్తే తరువాత మాట్లాడుదామని చెప్పాడు. పరిస్థితిని గమనించిన మధు, సూరిని తీసుకొని వెళ్లి అపోలో ఆసుపత్రిలో చేర్పించాడు. భాను గన్‌మెన్ మదన్‌మోహన్‌సింగ్ చేతిలో ఓ చిన్న ఆయుధం ఉండేది. ఇది మధుసాధన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసుల ఎఫ్ఐఆర్‌లో ఉన్న సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+