కెసిఆర్ వాదనను కొట్టేసిన చిదంబరం, ఆ వాదన అర్థరహితం

భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ వంటి పార్టీలనుండి వచ్చే ఇద్దరు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని అలాగే మిగిలిన పార్టీలు వ్యక్తం చేసుకోవచ్చునన్నారు. కానీ అఖిలపక్షాన్ని బహిష్కరించడం సరికాదన్నారు. ఇష్టంలేని వారు ఒకే ప్రతినిధిని పంపవచ్చని చెప్పారు. గతంలో పిలిచినట్టుగానే ఇప్పుడు పిలిచామని చెప్పారు.
అయినా ఇద్దరు ప్రతినిధులను రెండు అభిప్రాయాలు చెప్పమని చెప్పలేదన్నారు. అయితే మంత్లీ రిపోర్టు చెబుతున్న సమయంలో విలేకరులు తెలంగాణ, కెసిఆర్ అంశాన్ని ప్రస్తావించగా దానికి మరో ప్రెస్ మీట్ ఉంటుందని అది ఇప్పుడు కాదని చెప్పారు. అయితే విలేకరులు ప్రశ్నలు కురిపించే సరికి ఆయన ముక్తసరిగా సమాధానాలు చెప్పారు. అఖిల పక్షానికి అన్ని పార్టీలు వస్తాయని ఆయన ఆశించారు.












Click it and Unblock the Notifications