రూ. 300 కోట్లే మద్దెలచెర్వు సూరి హత్యకు కారణమా?

కాగా, సూరి ఇటీవల విశాఖపట్నంలో 70 కోట్ల విలువ చేసే భూవివాదం సెటిల్‌మెంట్ చేసినట్లు సమాచారం. ఈ సమయంలో మూడు రోజుల పాటు సూరి తన బంధువుల ఇంట్లో ఉన్నట్లు చెబుతున్నారు. సూరి ఇంటర్మీడియట్ చదివింది కూడా విశాఖపట్నంలోనే. కాగా, ఇటీవల విజయవాడలో ఓ పారిశ్రామికవేత్త ఆస్తి తగాదాలో కూడా భాను కిరణ్ చేయి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది తీవ్ర వివాదంగా మారింది. సూరి తనను ఎలాగూ చంపుతాడనే భయంతో భానే అతన్ని చంపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, సూరి హత్యకు ఇది మాత్రమే కారణం కాదని, సూరి హత్య వెనక పెద్ద కుట్ర జరిగిందని, ఓ మంత్రి కుమారుడి పాత్ర కూడా ఇందులో ఉందని సూరి బంధువులు అంటున్నారు.












Click it and Unblock the Notifications