హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెటిల్‌ మెంట్ల దందాకు పేరు మోసిన మద్దెలచెర్వు సూరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Maddelacheruvu Suri
హైదరాబాద్: అనంతపురం జిల్లా ఫ్యాక్షన్‌ నాయకుడు మద్దెలచెరువు సూరి, అతడి అనుచరుల కార్యకలాపాలన్నీ భూదందాలేననే ఆరోపణలున్నాయి. జైల్లో ఉన్నా, ఆస్పత్ర్లి చికిత్స పొందుతున్నా, ఎక్కడున్నా తన కార్యకలాపాలను సూరి సాగించేవాడని అంటారు. సెటిల్‌మెంట్లతోనే సూరి వర్గం ప్రధాన కార్యంగా చేసుకుందని పోలీసులు చెబుతారు. చర్లపల్లి జైలులో ఉన్న తొలినాళ్లల్లో అనంతపురం రాజకీయాలతో, రవి హత్యకు వ్యూహరచనలో కాలం గడిపిన సూరి ఆ తర్వాత భూ దందాలకు ఉపక్రమించారన్నది పోలీసుల సమాచారం. బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సెటిల్‌మెంట్ల వ్యవహారం మరింత ఊపందుకుందని వారంటున్నారు. అనంతపురం జిల్లాకు వెళ్లి వస్తూనే మరోవైపు నగరంలో కోట్ల రూపాయల్లో భూలావాదేవీలు చేసేవారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే నిరుడు హైదరాబాదులోని కేపీహెచ్‌బీ కాలనీలో భూకబ్జా ఒకటి వెలుగులోకి వచ్చింది.

వెన్నునొప్పి పేరుతో సూరి జైలు నుంచి నిమ్స్‌కు తరచూ రాకపోకలు సాగించారు. ఈ సమయంలో అనుచరులద్వారా స్థల యజమానులను ఆసుపత్రికి పిలిపించి దందాలు నెరపేవారని ఆరోపణ. 2009 నవంబరు, డిసెంబరు మాసాల్లో ఏకంగా 40 రోజులపాటు సూరి నిమ్స్‌లోని మిలీనియం బ్లాకులో ఉన్నాడు. అతడితోపాటు గన్‌మెన్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది కోసం 220, 221 నెంబర్లు గల గదులను కేటాయించారు. ఉదయం వేళల్లో సాధారణంగా చికిత్స పొందుతున్నట్లుగా ఉండే సూరి రాత్రివేళల్లో ఆసుపత్రి కేంద్రంగా పనులన్నీ చక్కబెట్టుకునేవాడని సమాచారం. ఈ సమయంలో కొందరు ప్రముఖులను సైతం ఆయన కలిసేవారని, ఇందులో భాగంగా భారీస్థాయిలో సెటిల్‌మెంట్లు జరిగేవనే విమర్శలున్నాయి. సెటిల్‌మెంట్లలో అనుచరులు మధుసూధనరెడ్డి, భానుప్రసాద్‌ కీలక పాత్ర పోషించేవారని సమాచారం.

నిరుడు కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో 654 చదరపు గజాలున్న ఒక స్థలాన్ని వీరు కబ్జా చేశారు. ఆ స్థలం ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టరుకు చెందినది. సూరి అనుచరులుగా చెప్పి ఆక్రమించుకోవడంతో ఆమె కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుచరులు నలుగురిపై కేసు (నెంబరు 469/10) నమోదైంది. ఇద్దరు లొంగిపోగా భాను, మధు పోలీసుల ఎదుటకు రాలేదని తెలిసింది. అయితే సూరి హత్య సమయంలో వీరిద్దరూ కారులో ఉండటం గమనార్హం. విజయవాడ, విశాఖల్లో జరిగిన భూ దందాల్లో సూరికీ ప్రమేయం ఉందన్న విమర్శలు వినిపించాయి. విజయవాడలో ఒక కేసూ నమోదైంది. రియల్‌ వ్యాపారంలో ఉన్న తెదేపా నేత ఒకరు బహిరంగంగానే సూరిపై ఆరోపణలూ చేశారు. ఇటీవల పుట్టపర్తిలో ఒక రియల్‌ వ్యాపారిని బెదిరించినట్లూ కేసు నమోదైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X