తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు మరో షాక్

తెలుగుదేశం ప్రముఖ నేత నారగోని తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. తన రాజీనామా ఫాక్సులో చంద్రబాబుకు పంపించినట్టు తెలుస్తోంది. నారగోని గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందు సామాజిక తెలంగాణ అనటంతో తెలంగాణకు అనుకూలమనే భావన ఉన్నందున ఆయన పార్టీలో చేరారు. ఆ తర్వాత ప్రజారాజ్యం తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి ఓ కొత్త పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరారు.












Click it and Unblock the Notifications