ఆంధ్రప్రదేశ్ కు చుక్క నీరు రాదు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు

బ్రజెష్ కమిటీ 75 సంవత్సరాల నీటిని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రానికి న్యాయం జరగేదని, 65 శాతం నీటి లభ్యతను తీసుకోవడం వల్లనే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ తీర్పు వల్ల రాష్ట్రానికి మిగులు జలాలు వస్తాయనే ఆశ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున మన లాయర్లు సమర్థ వాదన వినిపించలేక పోయారన్నారు. అడ్వోకెట్లు, ప్రభుత్వం తీరు వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు. కేంద్రంలో, మహారాష్ట్రలో, మన రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉండి ట్రిబ్యునల్ తీర్పువల్ల నష్టపోగా కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఎక్కువ లాభం పొందిందన్నారు.
ఈ పంపకాలతో మనకు పంటకాలంలో నీళ్లు రావటం కష్టమేనన్నారు. జూన్, జూలై నెలల్లో 10 టిఎంసీల నీరు ఇస్తే అవి ఎందుకు సరిపోవన్నారు. తుంగభద్ర పంపకంలో కూడా మనకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. అక్కడి కేసి కెనాల్‌కు నీరు రావటం ఎప్పుడో ఒకసారి జరుగుతుందన్నారు. వీటిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications