వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజనపై తదుపరి సమావేశం నాటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
న్యూఢిల్లీ: తదుపరి సమావేశం నాటికి రాష్ట్ర విభజన డిమాండ్‌ పై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని తాము చెప్పామని, తాము నిర్ణయానికి వస్తామని చిదంబరం చెప్పారని ఆయన గురువారం అఖిల పక్ష భేటీ అనంతరం చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని చిదంబరం కోరినట్లు ఆయన తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ పసలేని నివేదిక సమర్పించిందని సిపిఐ నాయకుడు గుండా మల్లేష్ అన్నారు. ఇప్పుడు జరగాల్సింది రాజకీయ నిర్ణయమని, ఆ నిర్ణయాన్ని కాంగ్రెసు పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అనే విధంగా నివేదిక ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలనే శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సు తమకు సమ్మతమని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య అన్నారు. నివేదిక పూర్తిగా చదివిన తర్వాత తమ అభిప్రాయం చెబుతామని ఆయన అన్నారు. నివేదిక పూర్తిగా చదివిన తర్వాత తన అభిప్రాయం వెల్లడిస్తానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. పది నెలల పాటు శ్రీకృష్ణ కమిటీ విశేష శ్రమ చేసి నివేదిక సమర్పించిందని ఆయన చెప్పారు. ఈ నెలలోనే పార్టీలు తమ అభిప్రాయం చెప్పాలని చిదంబరం కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తాను చిదంబరాన్ని కోరినట్లు కాంగ్రెసు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X