సముద్ర తీరంలో ఇంధన నిధి! ఒకేసారి 4 బేసిన్లలో మెగా ఆపరేషన్

భారతదేశం ఇంధన రంగంలో స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యంగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశంలోని తూర్పు తీర ప్రాంతాల్లో నిగూఢంగా దాగి ఉన్న చమురు, సహజ వాయు (గ్యాస్) నిల్వలను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా మహా నది, బెంగాల్-పూర్ణియ, కావేరి ,కృష్ణా-గోదావరి (కేజీ) లాంటి నాలుగు ప్రధాన బేసిన్లలో సమగ్ర సర్వేలు చేపట్టేందుకు అంతర్జాతీయ స్థాయి బిడ్లను ఆహ్వానించింది. ఇటీవల అండమాన్ సముద్రంలో భారీగా వాయు నిల్వలు లభించడంతో ఉత్సాహంగా ఉన్న అధికారులు, ఈ అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు.

ఏమిటీ 'మల్టీ-క్లైంట్’ మోడల్?

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మెగా సర్వే ప్రక్రియ 'మల్టీ-క్లైంట్’ విధానంలో సుమారు 36 నెలల (మూడేళ్ల) పాటు సాగనుంది. ఈ మోడల్ వల్ల ప్రభుత్వానికి పైసా ఆర్థిక భారం ఉండదు. జియోఫిజికల్ కంపెనీలే తమ సొంత పెట్టుబడితో అత్యాధునిక పరిశోధన నౌకలను రంగంలోకి దించి, డేటాను సేకరిస్తాయి.

India Seeks Global Partners For 36 Month Marine Survey To Uncover Hidden Oil And Gas Reserves In East Coast

ఆ తర్వాత ఆ నాణ్యమైన భౌగోళిక సమాచారాన్ని వివిధ ఇంధన సంస్థలకు విక్రయించుకుంటాయి. దశాబ్దాల నాటి పాత సీస్మిక్ డేటాను ఆధునిక ఇమేజింగ్ సాంకేతికతతో తిరిగి విశ్లేషించడం, అలాగే కొత్తగా 'బ్రాడ్‌బ్యాండ్ 3D సీస్మిక్ సర్వేలు' నిర్వహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. దీనివల్ల భూగర్భ స్థితిగతులపై క్లియర్ పిక్చర్ వస్తుంది. ఫలితంగా, గతంలో అన్వేషణ కష్టమని వదిలేసిన ప్రాంతాల్లో కూడా కొత్తగా డ్రిల్లింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది.

బంగాళాఖాతంలో భారీగా చమురు నిక్షేపాలు
బంగాళాఖాతంలో భారీగా చమురు నిక్షేపాలు

4 బేసిన్ల ప్రత్యేకతలివే..

  • మహానది బేసిన్: భారత డీప్-వాటర్ అన్వేషణలో ఇది అత్యంత కీలకమైనది. గతంలో ఇక్కడ హైడ్రోకార్బన్ ఆనవాళ్లు లభించినప్పటికీ వాణిజ్యపరంగా ఉత్పత్తి ఊపందుకోలేదు. ఇది బెంగాల్ ఆఫ్-షోర్ బేసిన్‌ను పోలి ఉంటుంది.
  • బెంగాల్-పూర్ణియ బేసిన్: గంగా-బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ కారణంగా ఇక్కడ 10 కిలోమీటర్లకు పైగా అవక్షేప పొరలు పేరుకుపోయాయి. ఇక్కడ మైయోసీన్ కాలానికి చెందిన విలువైన గ్యాస్ నిల్వలు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు.
  • కావేరి బేసిన్: ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తిలో దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే, భూమి లోపల ఉండే జురాసిక్ శకానికి చెందిన పొరల్లో ఇంకా ఎంతో ఇంధన సంపద దాగి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
  • కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్: దేశపు ప్రధాన గ్యాస్ క్షేత్రంగా పేరుగాంచిన కేజీ బేసిన్లో, డీప్-వాటర్ టర్బిడైట్స్ ,సంక్లిష్టమైన భూగర్భ నిర్మాణాల్లో దాగున్న కొత్త నిల్వలను పట్టుకోవడానికి ఈ ఆధునిక సీస్మిక్ ఇమేజింగ్ కీలకం కానుంది.
పెట్రోల్, గ్యాస్ కొరత వేళ కేంద్రం కీలక నిర్ణయం..! భారీ నిక్షేపాల వేట..!
పెట్రోల్, గ్యాస్ కొరత వేళ కేంద్రం కీలక నిర్ణయం..! భారీ నిక్షేపాల వేట..!

శబ్ద తరంగాలతో భూగర్భ మ్యాపింగ్

ఈ అన్వేషణ కోసం వాడే అత్యాధునిక పరిశోధన నౌకలు సముద్ర ఉపరితలంపై ప్రయాణిస్తూ, తమ వెనుక ఉండే ప్రత్యేక కేబుల్స్ (స్ట్రీమర్స్) ద్వారా శక్తివంతమైన శబ్ద తరంగాలను భూగర్భంలోకి పంపుతాయి. అక్కడ ఉన్న రాతి పొరలను ఢీకొని వెనక్కి వచ్చే ప్రతిధ్వనులను (ఎకోస్) రికార్డ్ చేయడం ద్వారా భూమి అడుగున ఉన్న నిర్మాణాలను శాస్త్రవేత్తలు మ్యాపింగ్ చేస్తారు. ఈ డేటాను కంప్యూటర్లలో విశ్లేషించి చమురు, సహజ వాయువు ఎక్కడ నిల్వ ఉన్నాయో ఖచ్చితంగా గుర్తిస్తారు. దేశ ఇంధన డిమాండ్ ఏటా పెరుగుతున్న తరుణంలో, ఈ సర్వేలు సక్సెస్ అయితే విదేశీ దిగుమతుల భారం తగ్గి, దేశీయ ఉత్పత్తి పెరిగి భారతదేశ ఇంధన భద్రత మరింత బలోపేతం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+