హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం మళ్లీ నిరాహార దీక్షకు దిగుతా: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగణ రాష్ట్రం కోసం అవసరమైతే మళ్లీ నిరాహార దీక్షకు దిగుతానని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో స్పష్టం చేశారు. శ్రీకృష్ణ నివేదిక ఇరు ప్రాంతాలు తమకు అనుకూలంగా ఉన్నది అని చెప్పుకునేలా ఉందని చెప్పారు. 1956కు ముందు ఏ తెలంగాణ అయితే ఉందో అదే తెలంగాణ మాకు కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు తెలంగాణలోని అందరూ ఏకం కావాలన్నారు. ప్రజలందరూ ఎప్పుడో కలిసి పోయారని, అయితే ఇక తెలంగాణ కోసం కలవాల్సింది రాజకీయ నాయకులేనన్నారు. తెలంగాణలోని కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు తెలంగాణ బాధ్యత తమపై పెట్టుకోవాలన్నారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు. మీరు చనిపోతే మేమూ సైతం కాల్చుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

మనము తెలంగాణకు దగ్గరగా వచ్చామన్నారు. నివేదిక అంతా గందరగోళంగా ఉందన్నారు. హైదరాబాదుతో పాటు మిగిలిన జిల్లాలను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే మిగిలిన నాలుగు జిల్లాలకోసమే ఇప్పుడు పోరాడుతున్నామా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ తో పాటు అన్ని జిల్లాలు కలిపి 1956కు ముందు తెలంగాణ కావాలన్నారు. తెలంగాణ కార్యాచరణ జెఏసి చైర్మన్ కోదండరాం నిర్ణయం ప్రకారం ఉంటుందన్నారు. తెలంగాణలో దించిన బలగాలకు ప్రభుత్వాలే కారణమన్నారు. బలగాలను వెంటనే తొలగించాలన్నారు. అందుకు అన్ని పార్టీలు పోరాడాలన్నారు. మనం తెలంగాణ కోసం ఎక్కడా రాజీ పడవద్దన్నారు. అవసరమైతే తెలంగాణ కోసం అన్ని పార్టీల రాజకీయ నాయకులు రాజీనామాలకు సిద్ధం కావాలి.

అంతేకానీ రాజీపడకూడదన్నారు. మనము సీమాంధ్రుల సొమ్మును కోరడం లేదన్నారు. తెలంగాణవాదుల ఓపికను పరీక్షించవద్దన్నారు. ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టవలసిందేనన్నారు. ఎలాంటి సందర్భం వచ్చినా మనం వ్యూహం ప్రకారమే వెళతామన్నారు. బయపడాల్సింది లేదన్నారు. మన అంతిమ లక్ష్యం తెలంగాణ సాధనే అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను తెలంగాణ కోసం అభ్యర్థిస్తున్నానన్నారు. తెలంగాణ కోసం మూడుప్రత్యేక బోర్డులు మనకు ఎందుకున్నారు. అలాంటివి చాలా వచ్చి పోయాయయన్నారు. ఆరు సూత్రాల పథకం, పెద్దమనుషుల ఒప్పందం, ఫజల్ అలీ కమీషన్ అన్నీ నీరుగారిపోయాయయన్నారు. ప్రత్యేక బోర్డులు వేయడం అంటేనే మనకు అన్యాయం జరిగిందని ఒప్పుకున్నట్టన్నారు.

కేంద్రం డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణ సాధించుకునే వరకు కేంద్ర ప్రభుత్వం వెంబడి పడతామన్నారు. బలగాలతో పోరాడటం మాకు తెలుసునన్నారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న తెలంగాణను రావణకాష్టంలా చేయవద్దన్నారు. ఏం జరిగినా తెలంగాణ కాంగ్రెసు నేతలదే బాధ్యతే అన్నారు. నివేదికలోని తెలంగాణకు అనుకూలంగా ఉన్న అంశాన్ని ప్రధానంగా తీసుకొని తెలంగాణ ప్రకటించాలన్నారు. హైదరాబాద్‌తో కలిసిన తెలంగాణకోసమే మన పోరాటం అన్నారు. హైదరాబాద్ రాజధానిగా ఉండే తెలంగాణ మాకు కావాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X