దీక్ష కోసం ఢిల్లీ వెళ్లిన వైయస్ జగన్: 24 బోగీలతో బయలుదేరిన ప్రత్యేక రైలు

జగన్ వెంట పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, రేగా కాంతారావు, కుంజా సత్యవతి, శివప్రసాద్‌రెడ్డి తదితర ఎమ్మెల్యేలు వెంట వెళ్లారు. కాగా 1.30 గంటలకు బయలుదేరవలసిన జగన్ రెండు గంటలు ఆలస్యంగా ఢిల్లీ బయలుదేరారు. జగన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరగానే భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. మాచర్ల ఎమ్మెల్యే సోదరులు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్,సినీనటుడు విజయ్‌చందర్ తదితరులు జగన్‌ను కలిశారు.












Click it and Unblock the Notifications