టిడిపిని వీడటం మీడియా ఉహాగానాలే: కడియం శ్రీహరి

తాము ఎలాంటి పరిస్థితుల్లో పార్టీని వీడేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఉండి పోరాడుతామని చెప్పారు. అయితే తెలంగాణకు సంబంధించి కొన్ని విషయాల్లో తమ అధ్యక్షుడు చంద్రబాబుతో విభేదించిన మాట వాస్తవమేనని అయినంత మాత్రాన పార్టీని వీడతామని ఊహాగానాలు సబబు కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిలబెట్టడానికి పార్టీ అధ్యక్షుడిని ఒప్పించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము తెలంగాణ తెలుగుదేశం ప్రత్యేక శాఖను కోరుతున్నామని అయితే దానికి చంద్రబాబు ఆమోదించలేదన్నారు. మూడు రోజులు పర్యటన కారణంగా 13వ తారీఖున వచ్చి మాతో చర్చిస్తానని చెప్పారని కడియం అన్నారు. తెలంగాణ టిడిపి ప్రత్యేక శాఖకు అధినేతను ఎట్టకేలకు మేం ఒప్పిస్తామని ఆయన చెప్పారు.
శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఇచ్చిందని, ఇప్పుడు రాష్ట్ర విభజన కేంద్రం పరిధిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ వారంతా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సిందేనన్నారు. మేం కూడా ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీ వీడకుంటా పోరాడుతామని చెప్పారు. కేంద్రం ఈ విషయాన్ని ఇంకా ఆలస్యం చేయడం సబబు కాదన్నారు. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా తెలంగాణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications