భాను కిరణ్ ప్లాన్ ‌కు కంగతిన్న మద్దెలచెర్వు సూరి, తీవ్ర ఆగ్రహం

Maddelacheruvu Suri
హైదరాబాద్: తన అనుచరుడు భాను కిరణ్ వ్యవహారాలకు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మద్దెలచెర్వు సూరి కంగు తిన్నట్లు తెలుస్తోంది. భానుపై, మధుపై అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జైలు జీవితం నుంచి బయటపడ్డాక మద్దెలచెర్వు సూరి ఆర్థికంగా చితికిపోయాడు. చిన్నాచితకా ఖర్చులకు సైతం భానుకిరణ్‌ను అడుక్కోవలసిన పరిస్థితికి చేరుకున్నాడు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రక్తచరిత్ర సినిమా ఖర్చులన్నీ భానుకిరణ్‌ వే. విజయవాడ సెటిల్మెంటుపై సూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. ఒక దశలో భానుతో తనకు ఎలాంటి సంబం ధం లేదని మీడియాతో చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత భాను చకచకా పావులు కదిపి, సూరి నుంచి దూరమైన అనుచరులందరినీ దగ్గరకు తీసుకుని తానే బాస్ కావడానికి మాస్టర్‌ప్లాన్ వేశాడు. అందులో మధు, ప్రసాద్, చోటారెడ్డి తదితరులంతా పాత్రధారులయ్యారు. సుమారు 9మంది భాను అనుచరులను వివిధ కో ణాల్లో పోలీసులు విచారించగా ఈ విషయాలు తెలిసినట్లు సమాచారం. తన పేరును అడ్డం పెట్టుకుని కోట్లు సం పాదించిన భాను, మధులు అవసరమైనపుడు అడిగిన మొత్తాలను సర్దకపోవడంతో లెక్కల పుస్తకాలను హ్యాం డోవర్ చేసుకోవడానికి సూరి ప్రయత్నించడమే హత్యకు దారి తీసిందని పోలీసువర్గాలు భావిస్తున్నాయి.

జైలు నుంచి సూరి బయటకు వచ్చాక తన పేరిట భాను, మధు కలిసి చేసిన సెటిల్‌మెంట్లు తెలుసుకుని కంగుతిన్నాడు. సొంత దుకాణాలు ప్రారంభించిన భాను, మధు తమ వ్యవహారాలను గుట్టుగా కొనసాగిస్తూ సూరిని పక్కన పెట్టేశారని, సూరికి కావాల్సిన సౌకర్యాలను అందజేస్తున్నట్టు నటిస్తూ, నమ్మకస్తులను ఆయన నుంచి ద రం చేసే పని మొదలుపెట్టారని, ఈ క్రమంలోనే సూరి నుంచి మంగలి కృష్ణ విడిపోయినట్టు తెలుస్తోందని ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనం సారాంశం. విజయవాడ సెటిల్మెంట్ వ్యవహారం నేపథ్యంలో భాను, మధు తదితరుల వ్యవహారాలపై సూరి దృష్టి సారించాడు. అసలు వాళ్లు ఏం చేస్తున్నారనేవిషయాలను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. దీంతో సూరి బతికుంటే తమ ప్రాణాలకు ముప్పు తప్పదని భావించిన వారిద్దరూ ఆయనను చం పటానికి కుట్ర చేసినట్టు సమాచారం. కాగా, కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిందని, ప్రధాన నిందితుడు పట్టుబడితే చిక్కుముడి వీడినట్టేనని పోలీసులంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+