కెఏ పాల్‌ కు ఎక్కువ చిరంజీవికి తక్కువ: జగన్‌ పై రేవంత్‌‌ రెడ్డి వ్యాఖ్య

Revanth Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవికి తక్కువ, కెఏ పాల్‌కు తక్కువ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్‌రెడ్డి మంగళవారం విమర్శించారు. రైతులు సమస్యలు ఎదుర్కొంటుంటే రైతుల పేరిట జగన్ బల ప్రదర్శనకు దిగుతున్నాడన్నారు. దీక్షల పేరుతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు కేంద్రంగా మార్చారని ధ్వజమెత్తారు. తన తండ్రి హయాంలో సంపాదించిన అవినీతి సొమ్ముతో కొనుగోలుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

వైయస్ జగన్‌కు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ చీల్చాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చడానికి ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి కుట్ర చేసిన విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖరరెడ్డి కేంద్ర మంత్రి పురంధేశ్వరిని ఎన్టీఆర్ కుటుంబం నుండి చీల్చలేదా అని ప్రశ్నించారు. తన తండ్రి వైయస్ పురంధేశ్వరిని ఎన్టీఆర్ కుటుంబంనుండి చీల్చడం తప్పుగా కనిపించనిది, ఇప్పుడు మాత్రం జగన్‌కు తప్పుగా కనిపిస్తుందన్నారు.

నాటి వైయస్ రాజశేఖరరెడ్డి నాటిన విషవృక్షాల వల్లే నేటి కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నీటిపై ఏర్పాటు చేసిన బ్రజేష్ కమిటీ తీర్పు వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఆ పాపం వైయస్‌దే అన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీకి ఇందులో పాపం ఉందని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరగడానికి కారణమైన మొయిలీని వెంటనే పదవి నుండి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలో తెలంగాణ కోసం పోరడాటానికి తెలంగాణ తెలుగుదేశం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలనుకున్న మాట నిజమేనని అయితే దానివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఊరుకున్నామన్నారు. అది సమసిపోయిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+