హైకమాండ్‌కు కాంగ్రెసు తెలంగాణ నేతల హెచ్చరిక, సమావేశంలో గొడవ

Congress Telangana MPs
హైదరాబాద్: పార్టీ అధిష్టానానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. అధిష్టానంపై వారు తీవ్రంగా మండిపడ్డారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ జలదీక్షకు వెళ్లిన తమ పార్టీ శాసనసభ్యులు వెళ్లడాన్ని ఆసరాగా చేసుకుని వారు పార్టీ అధిష్టానంపై విరుచుకుపడ్డారు. వైయస్ జగన్ దీక్షకు 24 మంది శాసనసభ్యులు వెళ్లిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం నైతికంగా లేనట్లేనని, సాంకేతికంగా మాత్రమే కొనసాగుతోందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాలకు వెళ్లకూడదని ఆయన పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు సూచించారు.

వైయస్ జగన్ దీక్షకు వెళ్లినవారికి లేని హైకమాండ్ తమకే ఉందా అని నల్లగొండ జిల్లా భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. అవసరమైతే తెలంగాణ కోసం తాము రాజీనామాలకు కూడా సిద్ధమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తాము 11 మంది పార్లమెంటు సభ్యులం ఓ శక్తి అని ఆయన అన్నారు.

తాము లేకపోతే కాంగ్రెసు పార్టీ లేదని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులకు ఓ న్యాయం తమకు మరో న్యాయమా అని ఆయన అడిగారు. పార్టీలో లేని వైయస్ జగన్‌తో కాంగ్రెసు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వెళ్లారని ఆయన అన్నారు. తాము పార్టీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. కాగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల సమావేశంలో తీవ్రమైన గొడవ జరిగింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు సమావేశానికి వచ్చి సభలో గొడవ చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ గురించి మాట్లాడని నాయకుల వద్దకు వెళ్లి నిలదీయాలని వారికి పొన్నం ప్రభాకర్, శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. కాసేపటికి గొడవ సద్దుమణిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+