వైయస్ జగన్ ఢిల్లీ జల దీక్ష: ధర్నాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరే

YS Jagan
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వైయస్ జగన్ వెంట కాంగ్రెసు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పలువురు ఢిల్లీకి చేరుకున్నారు. వైయస్ జగన్ మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు జలదీక్షను తలపెట్టారు. ఆయన మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో రైలులో ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన వెంట 1500 మంది ప్రత్యేక రైలులో ఢిల్లీలో చేరుకున్నారు. ఐదు వేల మందితో వైయస్ జగన్ దీక్ష త్వరలో ప్రారంభం కానుంది. పోలీసులు అనుమతి ఇస్తే జగన్ దీక్ష 24 గంటలు ఉంటుందని, లేదంటే సాయంత్రానికి విరమిస్తారని జగన్ వర్గం నాయకులు చెబుతున్నారు. పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, ఎపిఐఐసి మాజీ చైర్మన్ అంబటి రాంబాబు దీక్షకు ఏర్పాట్లు చేశారు.

కాగా, వైయస్ జగన్ వెంట శాసనసభ్యులు కొండా సురేఖ, కె. శ్రీనివాసులు, కుంజా సత్యవతి, తెల్లం బాలరాజు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదినారాయణ రెడ్డి, కమలమ్మ, బాబూరావు, నీరజా రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితురులు దీక్షలో పాల్గొనే అవకాశం ఉంది. పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్ జగన్ వెంట ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+