వైయస్ జగన్ సాక్షి చానెల్‌పై వీరప్ప మొయిలీ మండిపాటు

ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లలో మంత్రి కె. జానా రెడ్డి పేరు కూడా ఉంది. ఇదే వార్తాకథనాన్ని దాదాపు మక్కీకి మక్కీగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ సిఇవోగా ఉన్న స్టూడియోఎన్ చానెల్ కూడా ప్రసారం చేసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది.
ఆ వార్తాకథనంపై మొయిలీ గురువారం సాయంత్రం స్పందించారు. రాష్ట్ర రాజకీయాలపై తమకు పూర్తి అవగాహన ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర రాజకీయాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. ఇటు హైదరాబాదులో మంత్రి జానా రెడ్డి ఈ వార్తాకథనం నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆ వార్తాకథనాన్ని ఎందుకు ప్రసారం చేశారో తెలుసునని భేటీ అనంతరం జానా రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి మార్పు వార్తను ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications