మద్దెలచెర్వు సూరి హత్య వెనక వైయస్ జగన్ పాత్ర: తెలుగుదేశం

YS Jagan
హైదరాబాద్/విజయవాడ/అనంతపురం: మద్దెలచెర్వు సూరి హత్యోదంతం రాజకీయ మలుపు తీసుకుంటోంది. సూరి భార్య గంగుల భానుమతి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి హస్తం తన భర్త హత్య వెనక ఉందని ఆరోపించడంతో తెలుగుదేశం నాయకులు భగ్గుమన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ హస్తం సూరి హత్య వెనక ఉందని వారు ఆరోపించారు.

సూరి హత్య కేసులో బాబును తెరమీదకు తేవడంలో ప్రేరేపించిందెవరని భానుమతిని వారు ప్రశ్నించారు. 'బినామీల పేర్ల పై సూరి పెట్టిన ఆస్తులన్నింటినీ మళ్లీ ఇస్తామన్నందుకే బాబుపై బురద చల్లేందుకు యత్నించారా?' అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య భానుమతిని ప్రశ్నించారు. హైదరాబాద్‌తో పాటు కృష్ణా, అనంతపురం జిల్లాల టీడీపీ కార్యాలయాల్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశాల్లో నేతలు సూరి హత్యలో జగన్ పాత్ర ఉందని ఆరోపించారు.

కాంగ్రెస్ పెద్దలు సూరి కేసుపై ఆసక్తి చూపించడం లేదని, సీబీఐని ఆశ్రయిస్తానని చెప్పిన భానుమతి, ఇవాళ బాబును ముగ్గులోకి లాగుతున్నారని రామయ్య ఆరోపించారు. హత్య వెనుక జగన్ హస్తం ఉందని కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. భానుమతి చేత చంద్రబాబుపై ఆరోపణలు చేయిస్తున్నది కూడా జగనేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఆరోపించారు.

పరిటాల రవి హత్య మొదలునేడు సూరి వరకు తన హత్యా రాజకీయాల బండారం బయట పడుతుందన్న భయంతో అడ్డుగా ఉన్నారని తాను భావిస్తున్న వారిని జగన్ వరుసగా హత్యలు చేయిస్తున్నాడని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. సూరి హత్యలో పరిటాల కుటుంబీకుల హస్తముందన్న భానుమతి ఆరోపణలను టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథి తోసిపుచ్చారు. ఆమె మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. సూరి హత్య జరిగిన రోజు భానుమతి చిన్నాన్న, తమ్ముడు, బంధువులు ఈ హత్యకు పరిటాల కుటుంబానికి, టీడీపీకి సంబంధం లేదన్నారని గుర్తు చేశారు.

రాజకీయాలు నేరమయం కావడాన్ని వ్యతిరేకించే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు అని, సూరి హత్యకు ఆయన ప్రేరేపించారనడం నిరాధార ఆరోపణలు అని విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ పేర్కొన్నారు. వారికున్న ఆస్తుల వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి ఎదుటి వారి మీద బురద చల్లడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. సూరి భార్య భానుమతి చేసిన ఆరోపణలపై వంశీ ఓ టీవీ చానెల్‌తో అన్నారు. 'బాబు గురించి మాట్లాడే అర్హత భానుమతికి లేదు. ఇలాంటి పిచ్చి మాటలు మానుకోవాలి. రవి కుమారుడు విదేశాల్లో చదువుకుంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+