వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదకర జల్లికట్టు ప్రారంభం: ఎద్దులతో పోరాటానికి తరలి వచ్చిన జనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jallakattu
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు సరిహద్దులలో ఉన్న రంగంపేట గ్రామంలో ప్రమాదకర ఆట జల్లికట్టు ఆదివారం ప్రారంభమైంది. ఈ ఆటలో పాల్గొనేందుకు ఇరు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో యువకులు తరలి వచ్చారు. ఆటను వీక్షించేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు. అయితే ఇది చాలా ప్రాణాపాయమైన ఆట కావటంతో ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. అయినప్పటికీ ఆ గ్రామస్తులు ఈ ఆటను ఆడకుండా ఉండటం లేదు. ప్రభుత్వంతో తమకు సంబంధం లేదని తమకు సాంప్రదాయంగా వస్తున్న ఆట అని చెబుతున్నారు. ఈ పండుగను సంక్రాంతి పండుగ సమయంలో చేసుకుంటారు. దీనిని ఎద్దుల పండుగ అని అంటారు.

ఈ ఆట చాలా ప్రమాదకరమైనది. కొన్ని సందర్భాల్లో ఆటలో పాల్గొన్న వారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. ప్రాణాపాయమని తెలిసినప్పటికీ యువకులు ఆటకోసం ముందుకు రావడం గమనార్హం. చాలామంది ఈ ఆటలో గాయపడుతుంటారు. ఈ ఆటకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఎంతో కాలంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతోంది. ప్రభుత్వం దీన్ని నిషేదించడంతో పోలీసులు దానిని అడ్డుకుందామని చూడటం గ్రామస్తులు ఒప్పుకోక పోవటం జరుగుతూనే ఉంది. ఏటా జరిగినట్టే ఈ సారీ పోలీసులు భారీగా తరలి వచ్చారు. స్థానికులకు చెప్పి చూశారు. వినక పోవటంతో రక్షణాత్మక చర్యలకోసం అక్కడే మోహరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X