వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై అఖిలపక్షం ముందు 26లోపు కాంగ్రెస్ తేల్చేస్తుందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి ప్రణబ్ ముఖర్జీ మరో రెండురోజుల్లో సమావేశమయ్యే అవకాశముంది. ప్రత్యేక తెలంగాణ విషయంలో తమ పార్టీ వారి ఫైనల్ స్టాండ్ తీసుకొని ఆ తర్వాత అఖిలపక్షాన్ని త్వరగా ఏర్పాటు చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని ఇప్పటికే నాన్చడం వల్ల ఉద్రిక్తలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఉద్రిక్తలు తగ్గించడానికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా సమస్యను పరిష్కరించే దిశలో కేంద్రం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ ఎంపీలతో ఒకటి రెండుమార్లు ప్రణబ్ బేటీ అయ్యారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికకు ముందు తెలంగాణ ప్రాంత ఎంపీలను న్యూఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించారు. నివేదిక తర్వాత ఎవరూ ఉద్రిక్తలు పెంచేలా మాట్లాడకూడదని సూచించారు. అ తర్వాత నాలుగు రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకోసం రాజీనామా చేస్తామని న్యూఢిల్లీకి హెచ్చరికలు పంపారు. అందులో భాగంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

దాంతో ఆగ్రహించిన అధిష్టానం మరోసారిని వారిని రమ్మని పిలిచింది. అయితే ఢిల్లీ మాటలు భేఖాతరు చేస్తూ సమావేశం ఏర్పరుచుకున్న తర్వాతే వారు ఢిల్లీ వెళ్లారు. ప్రణబ్ వారితో భేటీ అయి రాజీనామాల వరకు వెళ్లవద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లాభం లేదనుకుని ఎంపీలు తెలంగాణ అంశాన్ని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డికి విన్నివించుకున్నారు. అధిష్టానాన్ని ఒప్పించాలని ఆయనను కోరారు.

ఈ నేపథ్యంలో మరోసారి తమ ఎంపీల స్టాండ్ తీసుకొని కేంద్రం నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పాయింట్లు సూచించిన నేపథ్యంలో వారు తెలంగాణ ప్రకటించడమో లేదు తెలంగాణకు రాజ్యాంగబద్ద రక్షణ కల్పించటమో ఏదో నిర్ణయం ఈ నెల 26లోపు తీసుకొని అఖిలపక్షాన్ని మరోసారి ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

అనుకోకుండా ఆలస్యమైనా 27వ తేది లేదా 28వ తేదిలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ అంశాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేదించాలని చూస్తోంది. అయితే కేంద్రంలో ఇప్పుడు ఎంపీల ఆవశ్యకత నేపథ్యంలో తెలంగాణ ఎంపీలను మంత్రి పదవులతో బుజ్జగించి ప్రస్తుతానికి రాజ్యాంగ రక్షణకే మొగ్గుచూపేందుకే కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది!.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X