భాను కిరణ్ చివరి సెటిల్మెంట్ శింగనమల రమేష్‌దే, గొడవ దానివల్లనే?

మీడియా కథనాల ప్రకారం - శింగనమల రమేష్ రెండేళ్ల క్రితం రెండు భారీ చిత్రాల నిర్మాణాన్ని ప్రారంభించారు. అతడికి తెలిసిన ఫైనాన్షియర్లద్వారా రూ.50 కోట్లు తెచ్చుకున్నారు. సినిమాలు ప్రారంభమయ్యాక షెడ్యూళ్లు సక్రమంగా పూర్తికాక దాదాపుగా ఆగిపోయాయి. స్థిరాస్థులను విక్రయించేందుకు ప్రయత్నించడంతో అనుకున్న ధర రాలేదు. ఈ లోగా ఫైనాన్షియర్ల ఒత్తిడి పెరిగిపోయింది. ఏడాది క్రితం కడప జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి తన అనుచరులతో రమేష్‌ను బంధించేందుకు ప్రయత్నించగా అతడు ఎర్రగుంట్లలో తప్పించుకుని చైన్నె పారిపోయాడు. వారు చెన్నైకీ వెళ్లి రమేష్‌ను కొట్టినట్లు సమాచారం. దీంతో భయపడిన రమేష్... కళ్యాణ్, భానుకిరణ్‌లను ఆశ్రయించాడు.
మాదాపూర్, కొండాపూర్ లోని స్థిరాస్థులను వీరు తీసుకుని ఆ రెండు భారీ చిత్రాలు విడుదలయ్యేందుకు సహకరించారు. ఈ సెటిల్‌మెంట్ సూరికి తెలియదు. డిసెంబరు చివరి వారంలో భానుకిరణ్ వాటిని విక్రయించగా రూ.15 కోట్లు వచ్చాయి. శింగనమల రమేష్ సూరిని కలిసినప్పుడు విషయాన్ని వివరించి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు సూరికి అసలు విషయం తెలిసింది. వెంటనే భానుకిరణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడమే కాకుండా కొట్టాడు. ఈ సంఘటన జరిగిన వారం రోజులకే సూరి హత్యకు గురయ్యాడు.












Click it and Unblock the Notifications