పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలంటూ సెమిస్టర్ పరీక్షలు బహిష్కరణ

మంత్రి దామోదర రాజనర్సింహా తెలంగాణ వేరు, విద్యార్థుల భవిష్యత్తు వేరు అనడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణే విద్యార్థులకు ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అమరవీరుల శవాలపైన తెలంగాణకు అనుకూలమని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికైనా ఆయా పార్టీనుండి బయటకు వచ్చి తెలంగాణ కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు ఎంసెట్ పరీక్షలను బహిష్కరించినట్లుగానే ఇప్పుడు పిజి సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తున్నామని చెప్పారు.
తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలు రాయడానికి ఏ విద్యార్థి సిద్దంగా లేడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రుల పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. కాగా ఉస్మానియా జెఏసి పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పలు కళాశాలల్లో పిజి సెమిస్టర్ పరీక్షలను విద్యార్థులు బహిష్కరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు.












Click it and Unblock the Notifications