కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు రగడ

Rayapati Sambasiva Rao
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన ప్రాతినిధ్యం లభించకపోవడంపై కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలవదన్న ఉద్దేశంతోనే అధిష్ఠానం మంత్రివర్గంలో రాష్ట్రానికి చోటివ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో 33 మంది ఎంపీలుంటే కనీసం నలుగురిక్కూడా కొత్తగా పదవులివ్వలేరా? అని ప్రశ్నించారు. తెలంగాణ వాళ్లకిచ్చినా అడ్డు చెప్పేవాళ్లం కాదని, తమకిచ్చినా వారేమీ అభ్యంతర పెట్టేవాళ్లు కాదని అన్నారు. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్‌ ఇబ్బంది పడుతుందని హెచ్చరించారు. కొండా సురేఖ సోనియాను బొంద పెడతానంటే కనీసం రాష్ట్ర మంత్రులు స్పందించలేదని అన్నారు. వచ్చే మే, జూన్‌లలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనుకోవడం భ్రమ అన్నారు. విస్తరణ 2014 ఎన్నికల ముందు ఉంటుందని వ్యంగ్యంగా అన్నారు.

ప్రస్తుత ప్రధానిది కూడా పీవీ నరసింహరావు పాలసీయేనని, చూద్దాం చేద్దాం అంటూ కాలయాపన చేస్తుంటారని విమర్శించారు. ఏం తప్పు చేశామని పదవులివ్వలేదు? మేం కాంగ్రెస్‌లో లేమా? అని ప్రశ్నించారు. ఇప్పుడు తీసుకున్న వారంతా మాకన్నా సీనియర్సా? అని అడిగారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ మీదకానీ, ఎంపీల మీద కానీ గౌరవం లేదన్నారు. ఒకపక్క జగన్‌, చిరంజీవి, కేసీఆర్‌, చంద్రబాబు ఫ్యాక్టర్‌ ఉన్నప్పుడు కనీసం అయిదుగురికి మంత్రి పదవి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. గురువారం ప్రణబ్‌తో జరిగే సీమాంధ్ర ఎంపీల సమావేశానికి వెళ్లాలా? వద్దా? అన్నది కూడా సమీక్షించుకుంటామని చెప్పారు. మేం ఏం చెప్పినా విననప్పుడు ఇలాంటి సమావేశాలకు వెళ్లి ఏం లాభం ఉంటుంది? అని ప్రశ్నించారు. విస్తరణలో వివక్షపై సీమాంధ్ర ఎంపీలంతా కూర్చొని సమీక్షించుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+