చిదంబరం, మన్మోహన్‌ లతో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. కాంగ్రెసు కోర్‌కమిటీ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సీఎం కేంద్ర హోంమంత్రి చిందంబరంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఇరువురూ చర్చలు జరిపారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలతోపాటు, తెలంగాణ అంశం, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక, రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులు తదితర వాటిపై చర్చిలు జరిపినట్లు తెలియవచ్చింది.

మధ్యాహ్నం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను సోనియాకు వివరించారు. సాయంత్రం కేంద్ర రైల్వేశాఖ మంత్రి మమతాబెనర్జీతో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిధులు, రైళ్లను కేటాయించాలని ఆమెను కోరనున్నారు. రాత్రి 7 గంటలకు ఆర్థిక శాకఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+