కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ జైపాల్‌రెడ్డి

పజలపై భారం మోపినప్పటికీ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 72 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. ఈ భారాన్ని ప్రభుత్వ ఆయిల్ సంస్థలు, ఆర్ధిక మంత్రిత్వశాఖ మోయాల్సి వచ్చిందన్నారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడానికి మొన్నటి వరకు ఈ శాఖకు మంత్రిగా ఉన్న మురళీ దేవరా కృషి చేశారని, ఇప్పుడు తాను కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానని వివరించారు. రాష్ట్రంలో రిలయన్స్‌కు గ్యాస్ కేటాయింపుల విషయాన్ని అడగగా...'ఇంకా అధ్యయనం చేయలేదు. చేసిన తర్వాత చెబుతాను" అని బదులిచ్చారు.
మన రాష్ట్రానికి వచ్చేసరికి మిగతావారికి అర్థం కాని రీతిలో కొంత పక్షపాతం చూపిస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పవర్ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో అడగగా...'ఇంతవరకు నడుస్తున్న చాలావరకు ప్రాజెక్టులకు గ్యాస్ ఇచ్చాం. ఇక ముందు కూడా ఎంత అవకాశం ఉంటే అంత చూస్తాం. పూర్తి అధ్యయనం చేయకుండా రాష్ట్ర ప్రాజెక్టులకు హామీలు ఇవ్వను" అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications