కాంగ్రెసుపై నిప్పులు చెరిగిన వైయస్ జగన్, కొనసాగుతున్న ఓదార్పు

రాష్ట్రానికి ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి ఇంత మంది ఎంపీలను మనం ఎందుకివ్వాలని జగన్ ప్రశ్నించారు. 'ఒక్క రైలు కావాలన్నా, రైలు రూటు కావాలన్నా మమతా బెనర్జీ దగ్గరికి పోవాలి. ఆవిడేమో పశ్చిమ బెంగాల్‌కో, కోల్‌కతాకో ఇస్తారు. అంతకుముందు రైల్వే మంత్రిగా లాలూప్రసాద్ ఉంటే.. ఆయనేమో బీహార్‌కు పంపుకొంటారు. చివరికి వ్యవసాయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పుకొందామంటే.. ఆ శాఖ మంత్రేమో మహారాష్టక్రు చెందినవారు. మరి మన రాష్ట్రం నుంచి ఎంపీలను ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీకి ఎందుకివ్వాలి?" అని ప్రశ్నించారు. వరుసగా వరదలు వస్తే రైతులను ఆదుకోవడానికి అవసరమైన ఆ మంత్రి పదవులు మన రాష్ట్రానికి ఎందుకు రావు? అని జగన్ ప్రశ్నించారు. 'ఆ పదవులను మన పార్టీ ద్వారా మనమే తెచ్చుకుందాం. మన ఆత్మగౌరవాన్ని మనం నిలుపుకొందాం. మన ఎంపీలను మనమే పంపుకొందాం. ఎవరు ప్రధాన మంత్రిగా ఉన్నా మన మంత్రి పదవులను మనమే తెచ్చుకుందాం. మా అభివృద్ధి మాకు కావాలి అని అడుగుదాం.." అని పిలుపునిచ్చారు.
పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై జగన్ నిప్పులు చెరిగారు. 'ఈ కాంగ్రెస్ పార్టీ పోలవరం కావాలని కొందరు ఎంపీలతో చెప్పిస్తుంది. మరికొందరితో వద్దని చెప్పిస్తుంది. పోలవరం ఇవ్వొచ్చు కదా అని అడుగుతున్నా.. ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు ఎందుకు నిర్మించడం లేదని అడుగుతున్నా. పేదల బాగోగులు చూసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. పెట్రోలు ధరలు ఆరు నెలల్లో ఏడుసార్లు పెంచారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. అసలు పేదవాడి గురించి కాంగ్రెస్‌కు ఏమైనా ఆలోచన ఉందా?" అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications