ధరల పెరుగుదలపై భగ్గుమన్న టిడిపి: చంద్రబాబు సైకిల్ యాత్ర

ధరలను అదుపు చేయలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగిపోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు నిరసనగా తమ పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని, ధరలు తగ్గించేవరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మోండా మార్కెట్ లో పరిస్థితి సామాన్యులు, పేదల కష్టాలకు అద్దం పడుతోందని ఆయన అన్నారు. ప్రజల కష్టాలు ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలకు అధికారంలో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications