ప్రధాని రాజీనామా చేయాలి: హైదరాబాద్ ధర్నాలో చంద్రబాబు డిమాండ్

2004 వరకు ఏ పన్నులైతే ఉన్నాయో వాటినే ఇప్పుడు అమలు చేస్తే ధరలు అదుపులోకి వస్తాయని తక్షణం దానికి కార్యాచరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ధరల నియంత్రణ చేతగాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజనామా చేయాలన్నారు. పేదలకు మాయమాటలు చెప్పి వైఎస్ లక్షల కోట్టు దోచుకున్నారన్నారు. పెట్రో ధరలు నియంత్రించే వరకూ పోరాటం ఆగదన్న చంద్రబాబు ఫిబ్రవరి మూడో తేదీ నుంచి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అంతకు ముందు చంద్రబాబు సికింద్రాబాదులోని మోండా మార్కెట్‌లో వ్యాపారులను, నినియోగదారులను కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సైకిల్ యాత్ర చేశారు.












Click it and Unblock the Notifications