గవర్నర్ భరద్వాజ్ పై బిజెపి ఆగ్రహం, రాష్ట్ర బంద్: పలు చోట్ల హింస

రాష్ట్రవ్యాప్తంగా తాము బస్సులను రద్దు చేశామని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. శుక్రవారం రాత్రి బస్సులపై రాళ్లు రువ్విన సంఘటనలు జరిగినప్పటికీ బెంగళూర్‌లో బస్సులు నడుపుతున్నామని బెంగళూర్ మెట్రోపాలిటన్ రవాణా సంస్థ తెలిపింది. అయితే, బస్సు సౌకర్యాలు సరిగా లేక బెంగళూర్ పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కార్యాలయాలకు చేరుకోవడానికి వారు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూర్‌లో 18 వేల మంది పోలీసులను నియోగించారు. యడ్యూరప్ప సొంత జిల్లా షిమోగాలో ఆందోళనకారులు అర గంటపాటు రైళ్లను ఆపేశారు.
కాగా, యడ్యూరప్ప రాజీనామా చేసే ప్రసక్తే లేదని బిజెపి తేల్చి చెప్పింది. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని బిజెపి ప్రకటించింది. యడ్యూరప్ప ప్రాసిక్యూషన్‌కు అనుమతించడం రాజ్యాంగవిరుద్ధమని, రాజకీయ దురుద్దేశంతో కూడిందని విమర్శించింది. ఇదిలా వుంటే, గవర్నర్ నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సమర్థించారు. ముఖ్యమంత్రి ప్రాసిక్యూషన్‌కు ఓ గవర్నర్ అనుమతించడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకు ముందు ఆలాంటివి జరిగాయని ఆయన అన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications