చంద్రబాబు దొంగల్లుడు, చిన్నపిల్లాడితో పోటీ పడుతున్నాడు: లక్ష్మీపార్వతి

Laxmi Parvathi
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి తమ దొంగ అల్లుడిగా అభివర్ణించారు. తమ దొంగల్లుడు చంద్రబాబు తమకే కాకుండా ప్రజలకు కూడా పంగనామాలు పెట్టారని ఆమె వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని ఆర్కె బీచ్‌లో శనివారం ఉదయం వైయస్ జగన్ జనదీక్షను ప్రారంభించారు. ఈ దీక్షా వేదిక మీది నుంచి లక్ష్మీపార్వతి మాట్లాడారు. చంద్రబాబు చిన్నపిల్లాడు వైయస్ జగన్‌ తో పోటీ పడుతున్నారని ఆమె అన్నారు. వైయస్ జగన్ కార్యక్రమాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆమె విమర్శించారు.

రిలయన్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని బయటపెడితే ప్రజలు చంద్రబాబుకు ఓటేయరని, ప్రజలకు నష్టం జరిగే విధంగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్నారని ఆమె అన్నారు. తమ అల్లుడు చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారని, తానే అన్నీ బాగు చేశానని చెప్పుకుంటున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు అదికారంలో ఉన్నప్పుడు తొమ్మిదేళ్లల 51సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, నాలుగు సార్లు కరెంట్ సార్లు పెరిగాయని, మూడు సార్లు ఆర్టీసి బస్సు చార్జీలు పెరిగాయని ఆమె వివరించారు. వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజలకు మంచి జరుగుతూ వచ్చిందని ఆమె చెప్పారు.

తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీ రామారావుకు ఎంతటి స్పందన లభించిందో అంతటి ప్రజాస్పందన ఇప్పుడు వైయస్ జగన్‌కు లభిస్తోందని ఆమె అన్నారు. వైయస్ జగన్ ఒక్కరే ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారని ఆమె అన్నారు. చంద్రబాబుకు మలేరియా పట్టుకుందని సినీ నటుడు ధర్మవరం సుబ్రహ్మణ్యం అన్నారు. వైయస్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తే సమాధానాలు చెప్పడం లేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్సించారు. అంతకు ముందు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+