కిరణ్ కుమార్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు: మేకపాటి

తెలుగుజాతిని విడదీయడానికి కాంగ్రెసు కుట్ర చేస్తోందని, 2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటన అందులో భాగమేనని ఆయన అంటూ తెలుగువారిని ఎన్నిసార్లు విడదీస్తారని ప్రశ్నించారు. నానా రకాలుగా హింసించి, మనోవేదనకు గురి చేసి వైయస్ జగన్‌ను పార్టీ నుంచి బయటకు పంపారని ఆయన విమర్శించారు. అందరం రాజీనామా చేద్దామని, రాజీనామాలు చేసిన తర్వాత తాము వైయస్ ఫొటో పెట్టుకుని పోటీ చేస్తామని, కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ఫొటో పెట్టుకుని పోటీ చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి దయవల్లనే కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. వైయస్సార్ 33 మంది పార్లమెంటు సభ్యులను ఇచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications