తెలంగాణపై సోనియా ఉక్కిరి బిక్కిరి: పార్టీలోనే రెండు అభిప్రాయాలు

Sonia Gandhi
న్యూఢిల్లీ‌: శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కూడా తెలంగాణపై ఎటూ తేల్చుకోలేక కాంగ్రెసు అధిష్టానం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుల్లో ఏకాభిప్రాయం వస్తే తప్ప ఏదో ఒక నిర్ణయం తీసుకోలేని స్థితిలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పడ్డారు. తెలంగాణ, సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తమ తమ అభిప్రాయాలకే కట్టుబడి ఉన్నారు. వారిలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో శుక్రవారం రాత్రి జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీలో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు.

తాము తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ముందుకు సాగే పరిస్థితి లేదు. ఈ సమస్యను 2013 వరకు సాగదీయాలనే పార్టీ అధిష్టానం ప్రయత్నం కూడా ఫలించే సూచనలు కనిపించడం లేదు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు యథాతథ స్థితికి అంగీకరించినా తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆగే పరిస్థితి లేదు. దానికి తోడు, విపక్షాల నుంచి తెలంగాణపై నిర్ణయానికి ఒత్తిడి తెస్తున్నాయి. సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు నివేదికలోని ఆరో ప్రత్యామ్నాయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. దీంతో సోనియా కక్క లేక మింగలేక అవస్థలు పడుతున్నారు.

తమ పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడం తొలుత భావించినట్లు ఈ నెల 26లోపు శ్రీకృష్ణ కమిటీపై కేంద్ర హోం మంత్రి చిదంబరం అఖిలపక్ష సమావేశం నిర్వహించే అవకాశాలు లేవు. తెలంగాణ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్‌లో అనిశ్చితి కొనసాగుతున్నందున ఇప్పటికిప్పుడు అఖిలపక్షం వల్ల ప్రయోజనం ఉండదని పార్టీ కోర్‌కమిటీ భావించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో శుక్రవారం రెండుగంటల పాటు సమావేశమైన కోర్‌కమిటీ ఏ నిర్ణయానికీ రాలేకపోయింది. రెండు ప్రాంతాల ఎంపీలతో చర్చలు కొనసాగుతున్నందున కొంతకాలం వేచి చూడడం మంచిదని కమిటీ అనుకున్నట్లు తెలిసింది. జనవరి 6న నిర్వహించిన అఖిలపక్షం భేటీని మూడు పార్టీలు బహిష్కరించాయని, రాష్ట్ర పార్టీలోనూ అనిశ్చితి ఉందని, పరిస్థితిలో ఎటువంటి మార్పూలేనందున ఇప్పటికిప్పుడు అఖిలపక్షం నిర్వహించడంలో అర్థం లేదని కోర్‌ కమిటీ భావించినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+