హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీ ప్రకటన జాప్యానికి తెలంగాణ లింక్ ఉందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలను ఓ మలుపు తిప్పిన వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి మూడో వారంలోనే పార్టీ పెట్టడానికి కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణా అంశంపై తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు ఓవైపు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే.. అదే సమయంలో జగన్ తన రాజకీయ పార్టీని ప్రకటించడానికి కసరత్తులు మొదలుపెట్టారు. తెలంగాణా అంశంపై శ్రీకృష్ణ కమిటి నివేదిక చేసిన ఆరవ సూచన (6. రాష్ట్రాన్ని సమైంక్యంగా ఉంచుతూనే తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగబద్ధ అభివృద్ధి మండలి)కే కేంద్రం సముఖత తెలిపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి జగన్ వర్గం నుంచి మంత్రి సబ్బం హరిని పంపారని అంటున్నారు. తెలంగాణా అంశంపై సర్కారు నాడిని పరీశీలించిన తర్వాత జగన్ పార్టీ గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ పెట్టబోయే పార్టీ మరింత పటష్టంగా నిలబడాలడలంటే తెలంగాణా అంశంపై జగన్ తన వైఖరి తెలిజేయాల్సి ఉంది. కానీ ఈ సమస్య నుంచి దూరంగా పారిపోవడానికే జగన్ పార్టీ ప్రకటించడంలో జాప్యం చేస్తున్నట్లు విమర్శకులు భావిస్తున్నారు.

ఒకవేళ సర్కారు గనుక శ్రీకృష్ణ కమిటీ చేసిన ఆరవ నియమానికి కట్టుబడి ఉంటే.. "బంగారు తెలంగాణ" అంటూ జగన్ కొత్త ప్రచారానికి తెరలేపే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే తెలంగాణాలో జగన్ బలపడే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లోపు తెలంగాణాపై కేంద్రం తమ నిర్ణయాన్ని ప్రకటించకపోతే జగన్ తన పార్టీ ప్రకటనను కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీని ప్రకటించినప్పటికీ తెలంగాణ అంశంపై మాత్రం కేంద్రం నిర్ణయం తర్వాతనే జగన్ నోరువిప్పే సూచనలున్నట్లు తెలుస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X