కాంగ్రెసు ప్రభుత్వాన్ని సానంపండి: ప్రజలకు వైయస్ జగన్ పిలువు

YS Jagan
విశాఖపట్నం: కాంగ్రెసు పాలనను సాగనంపాలని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కుర్చీ గురించి ఆలోచనే తప్ప పాలన గురించి కేంద్రంలో, రాష్ట్రంలో ఎవరికీ లేదని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పాలన గురించి ఆలోచించే స్థితిలో ఎవరూ లేరని ఆయన అన్నారు. విశాఖపట్నం జనదీక్ష కార్యక్రమంలో ఆయన శనివారం సాయంత్రం ప్రసంగించారు. మూడు రోజులుగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తుంటే పట్టించుకునేవారు లేరని, వైయస్సార్ ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని, ఎన్డియేకు మద్దతిచ్చారని, పెట్రోల్ ధరలు పెంచినా పట్టించుకోలేదని, రాష్ట్రంలో పేద ప్రజల గురించి కూడా ఆలోచన చేయలేదని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీలు నాలుగు సార్లు, బస్సు చార్జీలు మూడు సార్లు చంద్రబాబు పెంచారని ఆయన అన్నారు.

చంద్రబాబు ఐదేళ్లలో వంద శాతం కరెంట్ చార్జీలు పెంచారని, వంటగ్యాస్ ధరలు కూడా పెంచారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మనిషన్నవాడు ఒకే రకంగా ఉండాలని, అమ్మకం పన్నును చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా పెంచాడని, ఇప్పుడు అమ్మకం పన్ను తగ్గించాలని అంటున్నారని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరించి, అధికారంలో లేనప్పుడు మరో రకంగా మాట్లాడడం ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. కృష్ణా - గోదావరి బేసిన గ్యాస్ విషయంలో చంద్రబాబు మోసం చేశారని, బిడ్డింగులో పాలుపంచుకోకపోవడమే చంద్రబాబు చేసిన అన్యాయమని ఆయన అన్నారు. బిడ్డింగులో పాల్గొని ఉంటే వంద రూపాయలకో వంద యాభై రూపాయలకో గ్యాస్ వచ్చి ఉండేదని ఆయన అన్నారు.

కూరగాయల ధరలు మండిపోతున్నాయని, కూరగాయలను తాకితే షాక్ తగులుతోందని వైయస్ జగన్ అన్నారు. సంచులతో డబ్బులు తీసుకుని వెళ్తే పిడికిట్లో కూరగాయలు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఆరు నెలల్లో ఏడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని ఆయన అన్నారు. ఇతర దేశాల్లో మన దేశంలో కన్నా పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయని అంటూ ఆయన లెక్కలు చెప్పారు. చమురు కంపెనీల పేరు చెప్పి పెట్రోల్ ధరలు పెంచితే పేదవాడు ఎటు పోవాలని ఆయన అడిగారు.

వైయస్సార్ మరణించిన తర్వాత కాంగ్రెసు ప్రభుత్వం కరెంట్ చార్జీలు, ఆర్టీసి చార్జీలు పెంచిందని ఆయన విమర్శించారు. గ్యాస్ ధర 300 రూపాయల నుంచి 343 రూపాయలకు పెంచిందని ఆయన అన్నారు. మునుపటి చంద్రబాబు పాలన, ఇప్పటి కాంగ్రెసు పాలన దొందూ దొందే, విశ్వసనీయత, విలువలపై ఏ ఒక్కరికీ పట్టడం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+