బ్లాక్ మనీపై రాజకీయ నిర్ణయం తీసుకోవాలి: ప్రధానికి చంద్రబాబు లేఖ

నల్లధనం వల్ల దేశ భద్రతకు ముప్పు ఉందని సుప్రీంకోర్టు చెప్పినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆరోపించారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడానికే చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కారణం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోందన్నారు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు కేంద్రం ప్రత్యేక దౌత్యపరమైన చర్యలు ప్రారంభించాలన్నారు.
దేశంలో ధన రాజకీయాలు రాజ్యమేలుతున్నాయన్నారు. కాంగ్రెస్ నేతలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. దేశంలో అవినీతి లక్షలకోట్లకు చేరిందన్నారు. సత్యం రామలింగరాజుకు, 2జి స్పెక్ట్రం అవినీతికి తేడా ఏముందని ప్రశ్నించారు. అవినీతిపై అందరూ పోరాడాలని కోరారు. చట్టాన్ని కొందరు తమ చుట్టంగా మార్చుకుంటున్నారని అన్నారు.
రాజకీయ యంత్రాంగం, మీడియా, అధికార యంత్రాంగం కలిసి దేశాన్ని లూఠీ చేస్తున్నాయన్నారు. అవినీతి, అక్రమాలపై అన్ని పార్టీలు కలిసి పోరాడాలని సూచించారు. పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకోవటం వల్లే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందన్నారు. సాక్షాత్తూ దేశానికే నాయకత్వాన్ని ఇవ్వాల్సిన ప్రధాని నిస్సహాయంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications