తెలంగాణకు అందరమూ కట్టుబడి ఉన్నాం: మంత్రి జె గీతారెడ్డి

Geetha Reddy
నల్గొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయడానికి తాము సిద్ధమని నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం స్పష్టం చేశారు. అయితే రాజీనామా చేసి ఏ పార్టీ గుర్తుమీద పోటీ చేయాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సాధనకు ఓటమి అనేది లేదని ఆయన చెప్పారు. తాము రాజీనామా చేసిన అనంతరం ఏ పార్టీనుండి పోటీ చేయాలో కూడా రాజీనామాకు డిమాండ్ చేసేవారు చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలం కూడా కట్టుబడి ఉన్నామని మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యానించారు. మేం కూడా తెలంగాణవాదులమని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నామని చెప్పారు. మరో మంత్రి బసవరాజు సారయ్య మాట్లాడాతూ తమకు పదవులకంటే తెలంగాణ ముఖ్యమని చెప్పారు. తెలంగాణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంతా ఐక్యంగానే ఉందన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణపై పార్టీది ఒక వైఖరి, ప్రభుత్వానిది ఒక వైఖరి అనడాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి తప్పుబట్టారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు వేరువేరుగా స్పందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+