వైయస్ హెలికాప్టర్ ప్రమాదంలో సిఎంను ఎంక్వయిరీ చేయాలి: అంబటి

Ambati Rambabu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కిరణ్ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు మంగళవారం విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కిరణ్ 1999 వరకు వైయస్‌కు వ్యతిరేకంగా పని చేశారన్నారు. వైయస్ హెలికాప్టర్‌లో తాను వెళ్లేది ఉన్నప్పటికి వైయస్ తనకు ఓ పని అప్పగించినందువల్లే చివరి నిమిషంలో వెళ్లలేక పోయాననే వ్యాఖ్యలపై కూడా సిబిఐ ఎంక్వయిరీ వేయాలన్నారు. వైయస్ మరణంపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదం విషయంలో సిఎంను విచారించాలన్నారు. సిఎంను విచారించకుంటే అది అసంపూర్తి అవుతుందన్నారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం సరికాదన్నారు. ఆయన పదవి కోసమే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి తాను అన్నట్లు వైయస్ జగన్ దోషి అయినప్పటికీ నిర్దోషిగా నిరూపించే ప్రయత్నం చేసినందువల్ల ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేందుకు అర్హత కోల్పోయాడన్నారు. వైయస్ తనకు ఓ పని అప్పగించాడని చెబుతూ జగన్‌ను పరిటాల రవి హత్య కేసునుండి రక్షించే పని అప్పగించాడని చెప్పడం వైయస్‌ని కించపర్చడమే అన్నారు. వైయస్ వల్లే టిడిపికి శత్రువు అయ్యానని చెబుతున్నాడు. అంటే ఆయన చంద్రబాబుకు స్నేహితుడా అని ప్రశ్నించారు. వైయస్ మృతి తర్వాత చనిపోయిన వారికి ఏఐసిసి పరిహారం ఇంత వరకు అందలేదని అన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల ఆస్తుల విషయమై హైకోర్టు సుమోటోగా స్వీకరించడాన్ని కొందరు నేతలు, కొన్ని మీడియా సంస్థలు జగన్ ఏదో తప్పు చేశాడన్న భావనను కలిగిస్తున్నాయన్నారు. హైకోర్టు నోటీసులకు జగన్ సరియైన సమాధానం చెబుతారని చెప్పారు. నోటీసులు అందినంత మాత్రాన నేరస్తులు కాదన్నారు. ఎందరు కలిసినా జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. సిఎం వ్యాఖ్యలపై జగన్ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. వైయస్‌పై కాంగ్రెసు‌ది కపట ప్రేమ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ జగన్‌పై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+