Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్లాక్ మనీ నియంత్రణకు ఐదంచెల వ్యూహాన్ని అనుసరిస్తాం: ప్రణబ్

Pranab Mukherjee
న్యూఢిల్లీ: నల్లధనం నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అనుసరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. అక్రమ సంపాదనను, పన్ను ఎగవేతను నియంత్రించడానికి తాము క్రియాశీలకంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. నల్లధనంపై ఆయన మంగళవారం ప్రభుత్వ విధానాన్ని వివరించారు. ప్రధాని ఆదేశాల మేరకు తాను ప్రభుత్వ విధానాన్ని వెల్లడిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశం లోపల, వెలుపల ఎంత నల్లధనం ఉందనేది లెక్కలు తీయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 462 బిలియన్ డాలర్ల నల్లధనం ఉందని ఒక అంచనా అని, దేశం వెలుపల మన దేశ నల్లధనం ఎంత ఉందనేది గణించలేమని ఆయన చెప్పారు. విదేశాల్లో భారతీయులు దాచిన నల్ల ధనం ఎంత అనేది అంచనాలు లేవని ఆయన అన్నారు. నల్లధనం నియంత్రణకు ఇప్పటికే 22 దేశాలతో ఒప్పందాలు చేసుకున్నామని, మరో 65 దేశాలతో ఒప్పందాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నామని ఆయన వివరించారు.

పన్ను ఎగవేతదారుల సమాచారం సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. నల్లధనం నియంత్రణకు గత 18 నెలల్లో తీసుకున్న చర్యలు ప్రోత్సాహకర ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు. గత 18 నెలల్లో లెక్కలు చెప్పని 15 వేల కోట్ల నల్లధనం గుర్తించినట్లు ఆయన తెలిపారు. నల్లధనం నియంత్రణకు ఏర్పాటైన అంతర్జాతీయ టాస్క్‌ఫోర్స్‌లో భారత్ భాగస్వామిగా ఉందని ఆయన చెప్పారు. ధరలు తక్కువ చూపి పన్నులు ఎగవేసే పద్ధతి హానికరమని ఆయన అన్నారు. దేశంలోని నల్లధనం అంచనాకు ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భాగస్వామిగా ఉందని ఆయన చెప్పారు. నల్లధనం వివరాలను ప్రత్యక్షంగా వెల్లడించలేమని, అలా చేస్తే విదేశాలు నల్లధనానికి సంబంధించిన వివరాలు ఇవ్వవని, అయితే నేరస్తులను గుర్తించిన తర్వాత చర్యలు తీసుకోవచ్చునని ఆయన అన్నారు.

పన్నుల ఎగవేత ద్వారానే 77.6 శాతం నల్లధనం దేశ సరిహద్దులు దాటుతోందని ఆయన చెప్పారు. నల్లధనం ఎవరిదన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని ఆయన చెప్పారు. ప్రైవేట్ ఒప్పందం ద్వారా స్విస్ యుబిఎస్ బ్యాంక్ నుంచి అమెరికాకు సమాచారం అందుతోందని ఆయన అన్నారు. అమెరికా నేరుగా స్విస్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోలేదని ఆయన చెప్పారు. విదేశాల్లో నల్లధనం ఉన్న భారతీయులెవరు అనేది తనకు తెలియదని, అలా తెలిసే అవకాశం కూడా లేదని ఆయన చెప్పారు. యుబిఎస్ బ్యాంక్ ప్రతినిధుల అరెస్టు తర్వాతనే నల్లధనం విషయం వెలుగులోకి వచ్చిందని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+