జై బోలో తెలంగాణ అడ్డుకోవద్దంటూ సెన్సారు బోర్డు ఎదుట జెఏసి ధర్నా

Osmania University
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నిర్మించిన జైబోలో తెలంగాణ చిత్రం విడుదలకు సెన్సారు బోర్డు ఒప్పుకోకపోవడాన్ని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థులు మంగళవారం సెన్సారు బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. సెన్సారు బోర్డు వెంటనే జైబోలో తెలంగాణ చిత్రం విడుదలకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర పాలకుల కుట్రలో భాగంగానే చిత్రాన్ని అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. కాగా ఉదయమే తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తలు సైతం సెన్సారు బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. విడుదలకు అడ్డు చెప్పవద్దని డిమాండ్ చేశారు.

జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన జైభోలో తెలంగాణ చిత్రం ఎవరికీ వ్యతిరేకం కాదని ఆ చిత్ర దర్శకుడు శంకర్ స్పష్టం చేశారు. ఏ ఒక్క ప్రాంతాన్నో వ్యతిరేకిస్తూ చిత్రాన్ని తీయలేదని చెప్పారు. తెలంగాణ చరిత్ర నేపథ్యంలో మాత్రమే తీసిన చిత్రమని చెప్పారు. చిత్రాన్ని ఎవరూ కూడా అడ్డుకోకూడదని ఆయన కోరారు. కాగా సోమవారం చిత్రాన్ని చూసిన సెన్సారు బోర్డులోని నలుగురిలో ముగ్గురు చిత్రం విడుదలకు ఆమోదం తెలుపగా, ఒక సభ్యురాలు మాత్రం విడుదలకు నో చెప్పారు. దీంతో దర్శకులు శంకర్ మంగళవారం ఉదయం నుండి సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. సాయంత్రం వరకు చర్చలు జరిగే అవకాశముంది. ఈ చర్చలు విఫలమైతే రివైండ్ కమిటీని ఆశ్రయించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+