జగన్‌పై లేఖలు రాశా, బెదిరింపు కాల్సు వస్తున్నాయి: శంకరరావు

తనకు బెదిరింపు కాల్సు వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళుతానని చెప్పారు. అయితే హైకోర్టు జగన్‌కు నోటీసులు పంపినందువల్ల అతను తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. జగన్‌కు నోటీసులు పంపడం ద్వారా చట్టం ఎవరికైనా ఒక్కటే అనే విషయం తేటతెల్లమయిందన్నారు. వైయస్ హయాంలో జగన్ కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించారని చెప్పారు. అయితే తాను ప్రభుత్వంలో భాగంగా ఉన్నందువల్ల కేసు విషయం ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు.
జగన్‌పై ఆరోపణలు చూస్తుంటే వైయస్ రాజశేఖర రెడ్డి బతికి చచ్చాడు అనే వ్యాఖ్యలు నిజమనిపిస్తున్నాయన్నారు. ఆయనపై వందలాది ఆరోపణలు ఉన్నాయన్నారు. తనకు బెదిరింపు కాల్సు రావటంతో మినిస్టర్సు క్వార్టర్సుకు మారమని ఇంటెలిజెన్సు వర్గాలు సూచించినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications