భానుతో పాటు గుర్గావ్‌లో ఉన్నా, తర్వాత పారిపోయి వచ్చా: మన్మోహన్

మద్దెలచెర్వు సూరిని భానుకిరణ్ చంపిన విషయం తనకు తెలియదని మన్మోహన్ తన వాంగ్మూలంలో చెప్పాడు. సాయంత్రం ఆరు గంటలకు తనను కూకట్‌పల్లిలో ఉండమన్నాడని, అనంతరం 6.30 గంటల ప్రాంతంలో భాను మరొకరితో వచ్చాడని చెప్పాడు. తాను భానుకిరణ్, లోకనాథ్‌తో కలిసి షోలాపూర్ వెళ్లినట్లు చెప్పాడు. భానుకిరణ్, తాను కలిసి షోలాపూర్ నుండి పూణె వెళ్లినట్లు చెప్పాడు. పూణే నుండి ముంబయి మీదుగా గ్వాలియర్ వెళ్లామని చెప్పాడు. ఆ తర్వాత 8వ తేదిన ఉండే ప్రాంతాన్ని మార్చాలని భానుకిరణ్ యోచించినట్లు చెప్పాడు. ఇద్దరూ గ్వాలియర్ నుండి ఢిల్లీ మీదుగా గుర్గావ్ చేరుకున్నారు.
గుర్గావ్‌లో ఓ పేయింగ్ గెస్ట్ హవుస్‌లో ఉండేవారు. ప్రతిరోజు గుర్గావ్ నుండి ఢిల్లీ వచ్చి తెలుగు పత్రికలు చదువుతూ, సినిమాలు చూస్తూ ఉండేవారు. అనంతరం తిరిగి గుర్గావ్ వెళ్లేవారు. తాము ఇద్దరం అక్కడ ఉన్నట్టు ఎవరికీ చెప్పవద్దని తనను భానుకిరణ్ హెచ్చరించాడని చెప్పారు. తన గురించి పత్రికలలో వస్తున్న వార్తలను చూసుకుంటూ భాను ఎంజాయ్ చేసేవాడని మన్మోహన్ చెప్పాడు. అయితే తనకు తెలుగు రానందున పత్రికలలో ఏం వస్తుందో తనకు తెలియకుండా ఉండేదన్నారు.
ఒకరోజు తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడినట్టు మన్మోహన్ చెప్పారు. ఆ విషయం తెలిసిన భాను తనను చంపుతానని హెచ్చరించాడు. దీంతో తాను భయపడి ఈ నెల 20వ తారీఖున సాయంత్రం 4గంటల ప్రాంతంలో తన భానుకి చెప్పకుండా తన ఊరికి పారిపోయానని చెప్పాడు. ఆ తర్వాత 23వ తారీఖున పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులను తాము విడిది చేసిన ప్రాంతానికి తీసుకు వెళ్లానని, అయితే అప్పటికే భాను అక్కడినుండి తప్పించుకున్నాడని చెప్పారు.
కాగా భానుకిరణ్‌తో ఇన్నాళ్లూ మన్మోహన్ ఉన్నందువల్ల కొంచె ధైర్యంగా ఉండేవాడని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తరాది వాడైన మన్మోహన్ తనతో ఉండటం వల్ల చాలా సులభంగా తప్పించుకున్నాడని, అయితే మన్మోహన్ ఆయనతో విభేదించి పోలీసులకు చిక్కడంతో భానుకు ఇప్పుడు అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. మన్మోహన్ దొరికినందువల్ల భాను త్వరలోనే దొరికే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో భాను అరెస్టు అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మన్మోహన్ వాంగ్మూలంతో 20వ తేది వరకు ఢిల్లీ పరిసరాల్లో ఉన్న భాను ఇప్పుడు ఎక్కడున్నాడా అని వెతికే ప్రయత్నాల్లో పడ్డారు. అయితే మధురలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications