మద్దెలచెర్వు సూరి హత్యకు రెండు నెలల ముందే భాను స్కెచ్?

హత్య జరిగినప్పుడు భాను కిరణ్, మన్మోహన్ కూడా సూరి మృతదేహంతో అపోలో ఆస్పత్రి దాకా వచ్చారని, అన్నను చంపారంటూ అరిచారని, ఎవరో అభిమానులు అనుకున్నారు తప్ప భాను, మన్మోహన్ అని గుర్తించలేకపోయారని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌లో వార్తాకథనం వచ్చింది. అపోలో ఆస్పత్రి నుంచి కూకట్‌పల్లి వెళ్లి అక్కడి నుంచి వారిద్దరు సుబ్బయ్యతో కలిసి గుర్గావ్ పారిపోయినట్లు చెబుతున్నారు.
మన్మోహన్, సుబ్బయ్యలను కూడా హతమార్చేందుకు భాను సిద్ధపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మన్మోహన్‌ను భాను ఓ గదిలో బంధించాడని, అతని భార్య న్యాయవాది శ్రీకాంత్ గౌడ్‌కు ఫోన్ చేయడంతో సమాచారం పోలీసులకు చేరిందని, దాంతో మన్మోహన్ ఆచూకీని పోలీసులు కనిపెట్టారని అంటున్నారు. సూరి హత్య కేసులో ఆధారాలను పరిశీలిస్తున్నామని డిజిపి అరవింద రావు చెప్పారు.












Click it and Unblock the Notifications