ఎవరి ఫోటో పెట్టుకొని గెలవలేదు: మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి

JC Diwakar Reddy
హైదరాబాద్: తాను ఎన్నికలలో ఎవరి ఫోటోలు లేకుండా ఆరుసార్లు గెలిచానని కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి గురువారం విలేకరులతో అన్నారు. నేను ఎవరి ఫోటోలు పెట్టుకొని గెలవలేదన్నారు. దివంగత వైయస్ పోటోలు పెట్టుకొని కాంగ్రెసు ఎమ్మెల్యేలు గెలిచారన్న వ్యాఖ్యలపై ఆయన ఆ విధంగా స్పందించారు. ప్రభుత్వానికి మెజారిటీ లేదని విశ్వాసం నిరూపించుకోవాలని అన్న జగన్ వర్గం వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందన్నారు.

అయితే విశ్వాసం పెట్టుకోవాలా వద్దా అనే నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నేను ఎవరికీ విదేయుడిని కాదన్నారు. పార్టీ అధిష్టానానికి మాత్రమే విధేయుడనన్నారు. హైకమాండ్ ఏం చెబితే అది గుడ్డిగా చేస్తానని చెప్పారు. జగన్ అక్రమ ఆస్తులపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయదల్చుకోలేదన్నారు. తనకు అసలు అలాంటి ఉద్దేశ్యం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+