మేకపాటి పార్టీకి దూరమవుతున్నారని బాధపడుతున్నా: మంత్రి ఆనం

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి ఎప్పుడూ నేను విధేయుడినేనన్నారు. నిత్యం ఆయన చిత్రపటానికి నమస్కరించందే దినచర్యను ప్రారంభించనని చెప్పారు. రచ్చబండ కార్యక్రమంలో 96 శాతం మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. ఉద్యోగుల నిధులను రచ్చబండ కార్యక్రమానికి మరల్చుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయని, అయితే అందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఉద్యోగుల పీఆర్సీకి నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం ఉండదన్నారు. కాగా రచ్చబండ కార్యక్రమం అన్ని చోట్ల విజయవంతం అవుతుందన్నారు. కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రం ఆటంకం కలుగుతుందని చెప్పారు. రచ్చబండ కార్యక్రమానికి ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలను కేటాయించిందని, అందులో 1200 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు.












Click it and Unblock the Notifications